ఏజెన్సీ ప్రాజెక్టులపై పట్టింపేదీ..?

Does the agency care about projects?– పాలెం ప్రాజెక్టు పూర్తికాకుండానే ప్రారంభం
– లైనింగ్‌ పగుళ్లు.. కాల్వలకు గండ్లు
– 10,132 ఎకరాలు.. రూ.221 కోట్ల ఖర్చు
– తట్టమట్టి తీయకుండానే మోడికుంట ప్రాజెక్టుకు రూ.65 కోట్ల ఖర్చు
– అతీగతీ లేని గుండ్లవాగు
– పనులు ప్రారంభించాలని రైతు సంఘాల వేడుకోలు..
నవతెలంగాణ -వెంకటాపురం
పాలకులు మారిన రైతుల తలరాతలు మాత్రం మారడం లేదు. తలాపునే గోదావరి నది ప్రవహిస్తున్నా రైతుల పొలాలకు చుక్క నీరందించిన దాఖలాలు లేవు. సాగునీటి ప్రాజెక్టులను కడితే నీళ్లు పారి రైతుల కష్టాలు తీరుతాయి. కానీ, ఏజెన్సీ మారుమూల ప్రాంతమైన ములుగు జిల్లాలోని కొన్ని ప్రాజెక్టుల్లో డబ్బులే పారుతున్నా యి. చుక్కనీరు ఇవ్వని ప్రాజెక్టుల కోసం కోట్ల డబ్బులు కుమ్మ రించినా ఇంతవరకు వాటిపై సమీక్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించలేదు. ఉన్నతాధికారులైనా కదులుతా రనుకుంటే అది అత్యాశగానే మారింది. అనాలోచిత నిర్ణయాలు, పర్యవేక్షణా లోపంతో చేపట్టిన పనులు అక్కరకు రాకుండా తయారయ్యాయి. దశాబ్దాల కాలంగా ప్రభుత్వం ఉడతా భక్తిగా ఎంతో కొంత వ్యయం చేయడమే తప్ప ఒక్క చుక్క నీటిని గిరిజన ప్రాంతాల ప్రజలకు అందివ్వలేదు. నిధుల వ్యయం చేసినా ఏమాత్రం అక్కరకు వచ్చేలా పనులు సాగడంలేదు. మూడు మధ్యతరహా ప్రాజెక్టులకు కోట్లల్లో ప్రజాధనం ఖర్చు పెట్టారు. అంతేకాదు, మరో రూ.300 కోట్లకు రీ డిజైన్‌ ప్రతిపాదనలు పంపారు.
ములుగు జిల్లా వెంకటాపురం మండలం మల్లాపురం వద్ద పాలెంవాగుపై 2005లో రూ.70.99 కోట్ల అంచనా వ్యయంతో పాలెం ప్రాజెక్టును ప్రారంభించారు. ఆ పనులను ఎల్‌ఎస్‌, కేవీఆర్‌ కంపెనీలు దక్కించుకున్నాయి. ఈ ప్రాజెక్టు పూర్తయితే 10,132 ఎకరా లకు సాగునీరు అందుతుం ది. వెంకటాపురం, వాజేడు మండ లాల్లో 13.5కిలో మీటర్ల కాలువ నిర్మాణం జరిగిం ది. అధికారుల ప్రణాళిక లేమి, కాంట్రా క్టర్‌ ఇష్టారాజ్యంగా నిర్మిం చిన మట్టికట్ట 2006, 2008లో రెండు ధపాలు గండి పడి కొట్టుకుపోయి ంది. దాంతో అప్పటి ప్రభుత్వా నికి తీవ్ర అవినీతి విమర్శలు వచ్చాయి. ప్రాజెక్టు ఇన్‌ఫ్లో అంచనా వేయకుండా ఇష్టారాజ్యం గా పనులు చేసిన కాంట్రాక్టర్‌, అధికా రులపై గానీ ఎలాంటి చర్యలు తీసుకోకపోగా తిరిగి ప్రాజెక్టు పనులను వారికే కట్టబెట్టారు. పైగా ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.100.29 కోట్లకు పెరిగింది. అది కాస్తా 2017 నాటికి రూ.221.48కోట్లకు చేరింది. ఈ ప్రాజెక్టు పురోగతని 17-4-2017 న పరిశీలించిన అప్పటి భారీ నీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌ రావు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అయినా కాల్వల పనులు, ప్రాజెక్టు పనులు పూర్తిస్థాయి లో జరగలేదు. పాలెం ప్రాజెక్టు నుంచి మరికాల పంచాయతీ రామకృష్ణాపురం మధ్య లో ప్రాజెక్టు ఎడమ కాలు వపనులు 5 మీటర్ల మేర జరగాల్సి ఉన్నా జరగక పోవడంతో పూర్తిస్దాయిలో రైతులకు సాగునీరు అందిం చని పరిస్థితి నెలకొంది. దానికి తోడు ప్రాజెక్టు పనుల్లో జాప్యం జరగడంతో కాలువ లైనింగ్‌లన్నీ శిథిóలావస్థకు చేరుకున్నాయి. చిన్న పాటి వరదలు వచ్చినా పాలెం ప్రాజెక్టు ప్రధాన కాలువకు గండ్లు పడటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
కాగితాలు దాటని మోడికుంట వాగు..
వాజేడు మండలంలోని కృష్ణాపురం మోడికుంట వాగుపై ప్రాజెక్టు నిర్మాణానికి 2005లో రూ.120 కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. 2.142 టీఎంసీల నీటి మట్టం 13,591 ఎకరాలకు సాగునీరు అందించాలనేది లక్ష్యం. 0.12 టీఎంసీల నీటిని 35 గ్రామాలకు తాగునీరు అందించేందుకు 1.2మీటర్ల పొడవు 44.315 మీటర్ల ఎత్తులో కట్ట నిర్మించాలని ప్రాజెక్టు నిర్మాణానికి ప్రతి పాదనలు సిద్ధం చేశారు. కానీ ప్రాజెక్టులో తట్ట మట్టి తీయకుండానే రూ.65 కోట్లు ఖర్చు చేశారు. 2005లో రూ.118.95 కోట్లకు గామన్‌ ఇండియా కంపెనీ టెండరు దక్కించుకుంది. అటవీ శాఖ అనుమతు లకు రూ.62.34 కోట్లు, డీపీఆర్‌, భూసర్వేల ఖర్చుల కోసం రూ2.5 కోట్లు మొత్తం రూ65 కోట్లు ఖర్చు చేసింది. కాగా, 2018లో ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ425.16 కోట్లకు.. అనంతరం 2021లో రూ527.66 కోట్లు, ఇప్పుడు ఆ వ్యయం రూ.700.21 కోట్లకు చేరిందే తప్ప ప్రాజెక్టు పనులు నేటికీ ప్రారంభించిన దాఖలాలు లేవు. ప్రాజెక్టు పనులు ప్రారంభించి రైతులకు సాగునీరు, త్రాగునీరు అందించాలని వాజేడు మండల ప్రజలు కోరుతున్నారు.
కడగం(గుం)డ్ల వాగు..
వాజేడు మండలంలోని గుండ్లవాగువద్ద 2.580 ఎకరల సాగునీరు అందించే లక్ష్యంతో 1977-79 మధ్య రూ.4.10 కోట్లతో ప్రాజెక్టు పూర్తి చేసినా ఇప్పటివరకు 100 ఎకరాలకు నీరు అందించిన దాఖలాలు లేవు. 2013 వరకు ఈ ప్రాజెక్టుకు రూ.30 కోట్లు ఖర్చు పెట్టారు. ఈ ప్రాజెక్టులోకి వచ్చిననీరు రెండు రోజుల కంటే ఎక్కువ నిల్వఉండదు. ఈ ప్రాజెక్టు పరిధిలో ఇప్పటికే 12 బుంగలున్నాయి. ప్రతి వర్షాకాలం 100 నుంచి 150 ఎకరాలకు సాగునీరు అందిస్తున్న ప్రధాన కాల్వకు గండ్లు పడుతూనే ఉంటాయి.
మోడి కుంట పనులు ప్రారంభించాలి
వాజేడు, వెంకటాపురం మండలాల్లో ప్రారంభించిన ఒక్క ప్రాజెక్టూ పూర్తికాలేదు. పాలెం ప్రాజెక్టు పనులు పూర్తి కాకుండానే రాజకీయ లబ్ది కోసం హడావుడిగా ప్రారంభిం చారు. వాజేడు మండలంలోని మోడికుంట ప్రాజెక్టు పూర్త యితే గిరిజన రైతుల పొలాలు సస్యశ్యామలమవుతాయి. ప్రాజెక్టు పనులను వెంటనే ప్రారంభించాలి.
చిట్టెం ఆదినారాయణ, రైతుసంఘం జిల్లా అధ్యక్షులు
పాలెం ప్రాజెక్టు పనులు పూర్తిచేయాలి
అసంపూర్తి పనులతో ప్రాజెక్టును హడావుడిగా ప్రారం భించారు. కాలువలు అసంపూర్తిగా దర్శనమిస్తు న్నాయి. ప్రతి ఏడాది కాలువకు ప్రాజెక్టు ప్రధాన కాలువల కు గండ్లు పడి రైతుల పంట పొలాల్లో ఇసుక మేటలు వేస్తున్నాయి. ప్రాజెక్టు కాలువ పనులు పూర్తి చేయాలి. కాలువ మరమ్మతులు చేపట్టి రైతులకు సాగు నీరు అందించాలి. ఇరిగేషన్‌ అధికారులు రైతులకు అందుబాటులో ఉండేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలి.
గ్యానం వాసు,వ్యవసాయ సంఘం జిల్లా అధ్యక్షులు