నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
నాసాకు చెందిన నేషనల్ స్పేస్ సొసైటీ(ఎన్‌ఎస్‌ఎస్) 12 నుంచి 18 ఏండ్ల విద్యార్థులకు నిర్వహించిన అగ్రికల్చర్ మాడ్యూల్ డిజైన్ పోటీల్లో శ్రీచైతన్య ప్రపంచ చాంపి యన్‌గా నిలిచినట్టు ఆ సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ పోటీల్లో మొత్తం 47 ప్రాజెక్టులు రాగా 31 ప్రాజెక్టులు ఇండియా నుంచి ఎంపికైనట్టు తెలిపారు. కాగా ఇందులో 28 శ్రీచైతన్య విద్యార్థులవే ఎంపికైనట్టు వివరిం చారు. ఈ సందర్భంగా సంస్థ డైరెక్టర్ సీమ మాట్లాడుతూ బట్టీ పట్టే విధానానికి స్వస్తి పలు కుతూ కాన్సెప్ట్యువల్ టీచింగ్ మెథడాలజీ, యాక్టివిటీస్, ప్రాక ి్టకల్ ఓరియంటెడ్ టీచింగ్ ద్వారా మంచి ఫలితాలను సాధిస్తు న్నామని తెలిపారు.