– చారగొండ వెంకటేష్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
దోచుకున్న సొమ్మును కక్కిస్తామన్న భయంతోనే బీఆర్ నేతలు కేటీఆర్, హరీశ్ రావు పిచ్చి, పిచ్చిగా మాట్లాడుతున్నారని టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు చారగొండ వెంకటేష్, పున్న కైలాష్ నేత విమర్శించారు. సోమవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో వారు మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రాజెక్టులపై శాస్త్రీయ ఆధారాలతో మాట్లాడారని తెలిపారు. బాల్క సుమన్‌కు రేవంత్ రెడ్డిని విమర్శించే స్థాయి లేదని తెలిపారు. బాల్క సుమన్ దళిత ద్రోహి అని విమర్శించారు. బాల్క సుమన్‌కు వేల కోట్ల రూపాయలు ఎక్కడ్నుంచి వచ్చాయని వారు ప్రశ్నించారు. అమరవీరుల స్థూపం దగ్గర చర్చకు సిద్ధమా అని సవాల్ చేశారు.