
డిచ్ పల్లి మండలం లోని ఖిల్లా డిచ్ పల్లి సహకార సొసైటీ చైర్మన్ గజవాడ జైపాల్ వ్యక్తిగత కారణాలతో చైర్మన్ పదవికి మంగళవారం రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని డిసిఓ శ్రీనివాసరావుకు అందించారు. బుదవారం సహకార సొసైటీ లో చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. అంతకు ముందే చైర్మన్ పదవికి రాజీనామా చేయడంతో అవిశ్వాస సమావేశం ఉండక పోవచ్చని పలువురు పేర్కొంటున్నారు. రేండవ సారి చైర్మన్ గా గజవాడ జైపాల్ కొనసాగారు.ప్రస్తుత చైర్మన్ బీఅర్ఎస్ పార్టీ కి చెందిన వారు కావడంతో పలువురు డైరెక్టర్లు అవిశ్వాస తీర్మానానికి మొగ్గు చూపారు. అంతలోనే చైర్మన్ స్వయాన రాజినామా చేయడంతో మరొక్కరు ఛైర్మన్ కానున్నారు. మండలంలోని యానంపల్లి కి చెందిన డైరెక్టర్ రాంచందర్ గౌడ్ చైర్మన్ గా ఎన్నుకోనున్నారు తెల్సింది..