ఇద్దరు విద్యార్థినుల ఆత్మహత్య..

ఇద్దరు విద్యార్థినుల ఆత్మహత్య..– దోషులను గుర్తించి కఠినంగా శిక్షించాలి : ఎమ్మెల్సీ కవిత
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
భువనగిరిలోని ఎస్సీ బాలికల హాస్టల్‌లో విద్యా ర్థినుల ఆత్మహత్యపై ఆలస్యంగానైనా.. తమ డిమాండ్‌కు స్పందించి దర్యాప్తునకు విచారణాధికారిని నియమించినందుకు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ‘ఎక్స్‌’ట్విటర్‌ వేదికగా ధన్యవాదాలు తెలిపారు. అయితే నిష్పక్షపాతంగా, లోతుగా విచారణ జరిపించి కాలయా పన చేయకుండా ఇద్దరు బాలికల మరణానికి కారకులైన దోషులను త్వరగా గుర్తించాలని కోరారు. కఠినంగా శిక్షించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.