పొదిలిలో ఇండియన్‌ బ్యాంక్‌ కొత్త శాఖ ఏర్పాటు

పొదిలిలో ఇండియన్‌ బ్యాంక్‌ కొత్త శాఖ ఏర్పాటుప్రకాశం : ప్రభుత్వ రంగంలోని ఇండియన్‌ బ్యాంక్‌, అమరావతి జోన్‌ కొత్తగా ప్రకాశం జిల్లాలోని పొదిలిలో నూతన శాఖను ఏర్పాటు చేసినట్టు ప్రకటించింది. ఈ శాఖను హైదరాబాద్‌ ఫీల్డ్‌ జనరల్‌ మేనేజర్‌ గణేసరామన్‌ ఎ లాంచనంగా ప్రారంభించారు. ఖాతాదారులకు మెరుగైన రిటైల్‌, ఎంఎస్‌ఎంఇ, ఇతర బ్యాంకింగ్‌ సేవలను అందిస్తామని గణేసరామన్‌ హామీ ఇచ్చారు. ఉత్తమ పథకాలు, సర్వీసులు అందించడంలో ముందుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఇండియన్‌ బ్యాంక్‌ జోనల్‌ మేనేజర్‌ డిఎస్‌ మూర్తి, భవన యాజమాని యడ్ల వెంకటేశ్వర్లు, బ్యాంక్‌ సిబ్బంది పాల్గొన్నారు.