యాదవ హక్కుల సమితి ఆధ్వర్యంలో బెల్లి లలితక్కకు నివాళులు

నవతెలంగాణ – కూకట్‌ పల్లి
మలిదశ తెలంగాణా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో, గాన కోకిలగా పిలువబడి, ఉద్యమ గొంతుకగా, కళా సమితి కన్వీనర్‌గా తన రక్తాన్ని ధారపోసిన వీర వనిత, తన ప్రాణ త్యాగంతో కొత్త ఉద్యమానికి శ్రీకారం చుట్టిన అమరవీరురాలు బెల్లి లలితక్క 24వ వర్ధంతి సందర్భంగా, కూకట్‌పల్లి రామాలయం వద్ద ఆమె చిత్రపటానికి గొట్టి ముక్కల వెంకటేశ్వర్‌ రావు పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు మేకల రాములు, కూకట్‌ పల్లి యాదవ హక్కుల పోరాట సమితి అధ్య క్షుడు గండి మల్లేష్‌ యాదవ్‌, యాదవ సోదరులు పాల్గొన్నారు.