– C.V . RAMAN డ్రాయింగ్ తో స్వాగతం పలికిన విద్యార్థులు
– పిల్లలకు చదువుతో పాటు అన్ని రంగాల్లో ముందుండాలి
– సమాజంలో మూఢనమ్మకాలపై విద్యార్థులు ప్రదర్శించిన లఘు స్కిట్
నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ బాలోత్సవ్ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం రోజు హైదరాబాద్ కవాడిగూడ లోని ఇంగ్లీష్ యూనియన్ హై స్కూల్ లో బాలోత్సవ్ సైన్స్ జాత నిర్వహించారు .స్కూల్ ప్రిన్సిపాల్ స్వర్ణలత గారు మాట్లాడుతూ ఈ బాలోత్సవ్ కమిటీ ఒక వాలంటీర్ ఆర్గనైజేషన్, అందులో పనిచేస్తున్న వారు ఎటువంటి వేతనాలు తీసుకోకుండా నడిపిస్తున్న ఆర్గనైజేషన్, విద్యార్థులు చేసిన సైన్స్ ఎక్సపెరిమెంట్స్ని అభినందించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలాంటి ఆర్గనైజేషన్ చాలా అవసరం. విద్యార్థులకు సైంటిఫిక్ టెంపర్, స్కిల్ డెవలప్మెంట్ పెంచుకోవడానికి, ఫ్యూచర్ కి ఉపయోగపడేలా మీరు చేస్తున్న కృషి చాలా బాగుందని బాలోత్సవ్ కమిటీని అభినందించారు. ఈ బాలోత్సవ్ సైన్స్ జాత విజయవంతంగా నడువాలని, మా స్కూల్ యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు సహకారాలు అందిస్తామని బాలోత్సవ్ కమిటీకి కృతజ్ఞతలు తెలియజేసారు. విద్యార్థులు చేసిన సైన్స్ ఎక్సపెరిమెంట్స్ ని అభినందించారు. స్కూల్ విద్యార్థులు చేసిన 60కు పైగా సైన్స్ ఎక్సపెరిమెంట్స్ ప్రదర్శనలను బాలోత్సవ్ కమిటీ సభ్యులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. పిల్లల ప్రదర్శనలో ముఖ్యంగా మానవ హృదయం, మానవ శ్వాసకోశ వ్యవస్థ ఊపిరితిత్తులు, సూర్య గ్రహణం చంద్ర గ్రహణం,జీవవైవిధ్యం, గ్లోబల్ వార్మింగ్, వ్యర్థాల నిర్వహణ, రీసైక్లింగ్, యాసిడ్ రైన్స్ , అయస్కాంత ప్రక్రియ, అడవుల పెంపకం-అటవీ నిర్మూలన, అడవి మన జీవితం, అడవి మన జీవితం,నీటి మూలం, బంగాళాదుంప ప్రస్తుత భౌతిక రసాయన ప్రభావం,హరితగృహ ప్రభావం, కుమ్మరి ,కొబ్బరికాయ, అడవి, చరిత్రపూర్వ ఉపకరణాలు, సైన్స్ పరిణామం, మేజర్ న్యూట్రిషన్ ఫుడ్, మానవ పరిణామ దశలు, పరిణామం యొక్క వర్గీకరణ, సైన్స్ లేదా మూఢనమ్మకం, ద్రవాల వాహకత గల అనేక ప్రదర్శనలు చూపించారు .
బాలోత్సవ్ కమిటీ కార్యదర్శి ఎస్ . సోమయ్య మాట్లాడుతూ ఈరోజు కొత్తగా చేసిన ఎక్సపెరిమెంట్స్ చాల బాగున్నాయి. మేము ముక్యంగా 3 అంశాలు. సమాజంలో జరిగే ప్రతి విషయం గూర్చి ఆలోచించాలి. పిల్లలకు సైన్స్ టెంపర్ పెరగడం, పిల్లలు స్వతహాగా ఆలోచించడం, మూఢనమ్మలను అరికట్టడం .ఇలా ఎప్పుడైతే ఆలోచిస్తామో మన శక్తి పెరిగి సరి అయినా నడకలో ఉన్నత స్థాయిలోకి వెళ్లగలం. దీనికి నిదర్శనమే సైన్స్ ఎంతగానో అభివృద్ధి చెందింది కాబట్టి ఈ రోజు చంద్రమండలం పైకి చంద్రయాన్ -3 విజయవంతంగా పంపి, అక్కడ ఏమి జరుగుతుంది అనే విషయాలను మనం తెలుసుకుంటున్నాము. ఎలాంటి ప్రయోగాలు అయినా సరే నేర్చుకోగలిగే సత్తా ఒక్క భారత దేశం లో వున్న ప్రతి పౌరుడికి ఉంటుందని చెప్పారు. అందుకే బాగా చదువుకోవాలి, కొత్త విషయాలు తెలుసుకోవాలి, వాటి గురించి మన మేధస్సుకు పదును పెట్టాలి. తర్వాత ప్రయోగాలు చేయాలంటు తెలియచేసారు. సైన్స్ ఆదరానికి ప్రతిరూపం, మనము సైన్స్ లేకుండా ఏది నమ్మకూడదు. ఇప్పటికి మూఢనమ్మకాలతో ముందుకు వెళ్తున్నాము. పిల్లి ఎదురు వస్తే ఏమి జరుగుతుందో అని భయపడుతూ ఉంటారు. సమాజములో దొంగ స్వామీజీలు చలామణి అవుతున్నారు. వాటన్నింటిని అరికట్టాలంటే సైన్స్ ముందుకు వెళ్ళాలి. మనం అందరం ఐక్యంగా ఉండాలి. రాజ్యాంగం కొన్ని హక్కులు కల్పించింది. స్త్రీ పురుషుల మధ్య తేడాలు లేవు, అందరూ చదవాలి, అందరూ సమానంగా ఉండాలి. వీటికి భిన్నంగా కొంతమంది శక్తులు తప్పుదోవ పట్టిస్తున్నారు. సమాజంలో ఇప్పుడున్న పిల్లలు సరి అయినా దారిలో నడవాలి, అది విద్యార్థి దశలోనే సాధ్యమవుతాయని, ఎంతో మంది శాస్త్రవేత్తలు ఉన్నటువంటి మన దేశంలో, ఇంకా ఎంతో మంది పిలల్లు బాగా చదువుకుని, సైన్స్ తెలుసుకుని, నూతన శాస్త్రవేత్తలు గా మీరందరు రావాలి .సమాజంలో మూఢనమ్మకాలు ఏ విధంగా ఉంటున్నాయి. మీరు ప్రదర్శించిన స్కిట్ చాలా బాగుందంటూ. మీరు సాధించడానికి కావాల్సిన సహాయ సహకారాలు తెలంగాణ బాలోత్సవ్ కమిటీ ఎప్పుడు సిద్దగా ఉంటుందని చెప్పారు. తెలంగాణ బాలోత్సవ్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ కె . సుజావతి గారు మాట్లాడుతూ.. పిల్లలందరికీ అభినందనలు తెలియజేస్తూ ఈ సైన్స్ జాత లో పాల్గొన్న పిల్లలను చూస్తుంటే ఇంకా మనము సైంటిఫిక్ టెంపర్ పెంచడములో ముందుకు వెళ్ళాలి. మీరు ఎంతో శ్రమతో, ఓర్పుతో ఇచ్చిన సమయాన్ని వృధా చేయకుండా చేసిన సైన్స్ ఎక్స్పరిమెంట్స్ చక్కగా ప్రదర్శించడానికి ప్రోత్సహించిన స్కూల్ యాజమాన్యానికి, ప్రిన్సిపాల్ గారికి, టీచర్స్ కి తెలంగాణ బాలోత్సవ్ కమిటీ తరపున ధన్యవాదాలు తెలియచేసారు . బాలోత్సవ్ కమిటీ సంయుక్త కార్యదర్శి మమతా మాట్లాడుతూ.. పిల్లలకు చదువుతో పాటు అన్ని రంగాల్లో ముందు ఉండాలని, మాతో ప్రిన్సిపాల్ చెప్పినప్పుడు చాలా సంతోషం కలిగింది. ఈ ప్రయోగాలుకి టీచర్స్ చాలా బాగా సహకరించారు. అందరు చాలా డిసిప్లేన్ గా ఉంటూ, చక్కగా మీరు చేసిన ఎక్సపెరిమెంట్స్ గురించి వివరణ ఇచ్చారు. మీకు ఇలాంటి అనుభూతి ప్రతి తల్లిదండ్రులకు కూడా కలగాలని పిల్లల చప్పట్లతో సంతోషాన్ని వ్యక్తపరిచారు. ఈ అవకాశాన్ని కల్పించిన బాలోత్సవ్ కమిటీ కి కృతజ్ఞతలు తెలిపారు. కొత్త విషయాన్ని నేర్చుకోవాలంటే మీరందరు కచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి ఎన్నో ప్రయోగాలు చేయాలి. అప్పుడు మాత్రమే సక్సెస్ అవుతారు. క్లాప్స్ చేస్తున్నప్పుడు మీ అందరూ స్మైల్ తో చేశారు. అలాగే బాగా చదవాలి,అన్ని విషయాలు తెలుసుకోవాలి, కొత్తగా ప్రయోగాలు చేస్తూ, కొత్త ఆవిష్కరణలు చేయాలంటే మన నాలెడ్జ్ పెంచుకోవాలి అన్నారు. మనం ప్రతి రోజు వాడుతున్న మొబైల్ , న్యూ అప్డేట్స్, న్యూ టెక్నాలజీ తో చేస్తున్నారు. ఏఐ టెక్నాలజీ కూడా వచ్చేసింది. ఇవ్వని ఎలా సాధ్యమయ్యాయి? మీరందరు నాలెడ్జ్ మెరుగుపరుచుకోవడం వలన కోత్తగా ప్రయోగాలు చేయడం వలన సక్సెస్ అయ్యారు. ఫిబ్రవరి 28 నేషనల్ సైన్స్ డే సందర్భంగా బాలోత్సవ్ కమిటీ సైన్స్ జాతని నిర్వహిస్తుంది. ఇందులో ఇక్కడ ఆవిష్కరించిన ది బెస్ట్ సైన్స్ ఎక్సపెరిమెంట్స్ ని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఫిబ్రవరి 24 న జరగబోయే సైన్స్ జతలో అవకాశం కల్పిస్తారు.మీకు ఎప్పుడు ఎలాంటి సహకారాలు కావాలన్నా మేము మీతో ఉంటామని చెప్పారు. చివరగా బాలోత్సవ్ కమిటీ డిజిటల్ ప్లాట్ ఫార్మ్ క్రియేటివ్ డైరెక్టర్ నవీన్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు ఇంటికి వెళ్ళగానే ఎక్కువ సేపు మొబైల్, ఆన్లైన్ లో గడుపుతున్నారు . మనకు అవసరం లేనివి కూడా చూస్తూ ఉండిపోతున్నారు. మీరు చేసిన అద్భుతమైన సైన్స్ ఎక్సపెరిమెంట్స్ ని ఒక డిజిటల్ ప్లాట్ ఫార్మ్ T10 సహకారంతో బాలోత్సవ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా చూపించాలని మా ఈ ప్రయత్నం త్వరలోనే మీ ముందుకు వస్తుంది. మూఢనమ్మకాలు ఇంకా కొన్ని గ్రామాలలో ఉన్నాయి . అందుకు ప్రత్యామ్నాయంగా విజ్ఞాన దర్శిని రమేష్ తో కలిసి ఇంతకముందు 10 టీవీ లో మాయామశ్చింద్ర అనే ప్రోగ్రామ్స్ చేసి అక్కడున్న ప్రజలకి మూఢనమ్మకాలపై కళ్ళకు కట్టినట్టుగా వాస్తవాలని చుపించాము. అందుకని మేము ప్రతీ స్కూల్ లో విద్యార్థుల నుండి వచ్చిన ఐడియాలజీ, పిల్లలు చేసిన ది బెస్ట్ ఎక్సపెరిమెంట్స్ ని ఈ ఛానెల్ ద్వారా చూపించాలనుకుంటున్నాము. దీనికి మీరందరి కృషి చాలా అవసరం. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు.