ఉపాధ్యాయుడిని అభినందించిన కలెక్టర్

నవతెలంగాణ  – కంటేశ్వర్
ఇటీవల జరిగిన ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ లో జిల్లా నుంచి పాల్గొన్న ఏకైక ఉపాధ్యాయుడు ముద్దుకృష్ణను కలెక్టర్ హనుమంతుల రాజీవ్ గాంధీ అభినందించారు. విద్యార్థులను సైన్స్ పట్ల అవగాహన కల్పిస్తూ సైంటిఫిక్ టెంపర్ వృద్ధి చేస్తూ, వివిధ రకాల సైన్స్ ఫెయిర్లలో రాష్ట్ర జాతీయ స్థాయికి తీసుకువెళ్లడంలో ముద్దుకృష్ణ కృషిని అభినందించారు. ఇన్నోవేటివ్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ తయారు చేయడంలో ముద్దుకృష్ణ ప్రథమ స్థానంలో ఉంటారు. ముద్దుకృష్ణ నిజామాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు.