స్కాలర్స్ హైస్కూల్ లో ఉచిత కంటి పరీక్షలు

నవతెలంగాణ –  కంటేశ్వర్
సూర్య ఆరోగ్య సంస్థ నిజామాబాద్ వారి అధ్వర్యంలో స్కాలర్స్ హైస్కూల్ వారి సౌజన్యంతో స్కాలర్స్ హై స్కూల్, నిజామాబాద్ లో విద్యార్థులకు ఉచితంగా కంటి పరీక్ష శిబిరం బుధవారం నిర్వహించడం జరిగింది. మొత్తం 284 మంది విద్యార్థులకు, వారి పేరెంట్స్ కు ఆప్తలమిక్ శ్రీకాంత్ కంటి పరీక్షలు నిర్వహించి, కంటిచుక్కల మందులను పంపిణీ చేయడం జరిగింది. అలాగే విద్యార్థులకు కంటి సమస్యల పట్ల అవగాహన కల్పించారు. దృష్టి లోపం ఉన్న విద్యార్థులకు  కళ్లజోళ్లు పంపిణీ చేస్తామని పాఠశాల కరస్పాండెంట్ కృష్ణవేణి గారు  వెల్లడించారు. సంస్థ సి ఓ ఓ రాజేంద్ర కుమార్ విక్రమ్, ప్రశాంత్, వినోద్. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు కృష్ణ వేణి,ప్రవీణ్ కుమార్ ఇతర ఉపాద్యాయులు,సౌజన్య, అక్షయ పాల్గొన్నారు.