రూ.500 కు గ్యాస్ సిలిండర్ పథకం అమలు పరచాలి

నవతెలంగాణ  – భువనగిరి
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారంటీల పథకంలో భాగంగా వంట గ్యాస్ సిలిండర్ ను రూ. 500 ఇస్తామన్నా హామీని తక్షణమే అమలు చేయాలని తెలుగు మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు సోమన సబితా డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక సరస్వతి ఎంటర్ప్రైజెస్ ఇండియన్ గ్యాస్ కార్యాలయం ముందు తెలంగాణ మహిళా సంఘం ఆధ్వర్యంలో మహిళలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కృత్రిమంగా గ్యాస్ కొరతను సృష్టిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఇళ్లలో నిల్వచేసి ఎక్కువ ధరకు అమ్ముతున్న వారిపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలన్నారు. గ్యాస్ కు వేలిముద్ర కేవైసీని ప్రతి ఇంటికి వెళ్లి తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. మహిళా సమాఖ్య వర్ధిల్లాలి ప్రభుత్వం ప్రకటించిన రూ. 500 గ్యాస్ వెంటనే ఇవ్వాలని నినాదాలు చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో మహిళా సమాఖ్య పట్టణ కార్యదర్శి దిండిగళ్ళ రుక్మిణి, మహమ్మద్ రేష్మ, వనం పూజిత, గజ్జి, అలివేలు, మౌనిక పాల్గొన్నారు.