
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
గ్రామాలలో ప్రజలకు సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని అడిషనల్ కలెక్టర్ గరీమ అగర్వాల్ అన్నారు. బుధవారం హుస్నాబాద్ మండలంలోని నాగారం, మహ్మదాపూర్ గ్రామాల్లో ప్రత్యేక పారిశుధ్య వారోత్సవాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా అడిషనల్ కలెక్టర్ గరిమ అగార్వల్ గ్రామాలలో గ్రామపంచాయతీ కార్యాలయాలను, నర్సరీలను, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను పరిశీలించారు. పారిశుధ్య నిర్వహణ పై గ్రామస్తులతో మాట్లాడారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు గణితం పాఠాలు చెప్పారు. తడి పొడి చెత్త వేరుగా చేసి పారిశుధ్య కార్మికులకు ఇవ్వాలని, దాంతో తయారు చేసే కంపోస్ట్ ఎరువు మొక్కల పెంపకానికి ఉపయోగపడుతుందన్నారు. గ్రామాలలో జరిగే వివాహాది శుభకార్యాలకు ప్లాస్టిక్ పేపర్లు గ్లాసులు వాడే బదులు, స్టీల్ బ్యాంకులో ఉన్న వస్తువులను వినియోగించాలని గ్రామస్తులకు సూచించారు. జాతరలకు వెళుతున్న సమయంలో పేపర్ ప్లేట్లకు బదులు స్టీల్ ప్లేట్లను తీసుకెళ్లాలని అందువల్ల చెత్త చెదారం ఎక్కువ కాకుండా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లకావత్ మానస, డిపిఓ, దేవకీదేవి, స్పెషల్ ఆఫీసర్ సరోజ, ఎం పి ఓ సత్యనారాయణ , ఏపిఎం శ్రీనివాస్, ఏపీవో పద్మ ,సీసీ లు, గ్రామపంచాయతీ కార్యదర్శులు రాజమ్మ, మాజీ సర్పంచులు బత్తుల సునీత శ్రీనివాస్, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.