నాలేశ్వర్ లో పల్లెకు పోదాం చలో కార్యక్రమం

నవతెలంగాణ – నవీపేట్
మండలంలోని నాలేశ్వర్ గ్రామంలో ఎంపీటీసీ రాధా అధ్యక్షతన  మండల అధ్యక్షులు ద్యాగ సరిన్ ఆధ్వర్యంలో పల్లెకు పోదాం చలో కార్యక్రమ కరపత్రాలతో కేంద్ర ప్రభుత్వ పథకాలపై బుధవారం ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సరీన్ మాట్లాడుతూ ఈనెల 5వ తేదీ నుండి 8వ తేదీ వరకు కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా రైతులు, యువకులు, దళితవాడలలో మరియు మహిళలను కలిసి పథకాలను వివరించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో భూత అధ్యక్షులు గణేష్, సుంకరి రాజు, శ్రీనివాస్, జగతి, సాయి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.