విధ్వంసాల జాతర మొదలైంది..

విధ్వంసాల జాతర మొదలైంది..రవితేజ నటించిన నయా యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘ఈగిల్‌’. కార్తీక్‌ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది. ఈ చిత్ర రిలీజ్‌ ట్రైలర్‌ని బుధవారం మేకర్స్‌ విడుదల చేశారు. దర్శకులు అనిల్‌ రావిపూడి, బాబీ, హరీష్‌ శంకర్‌లతో కూడిన ట్వీట్ల థ్రెడ్‌తో మేకర్స్‌ ఉదయం నుండి దీని కోసం చాలా ఆసక్తిని పెంచారు.
రిలీజ్‌ ట్రైలర్‌ రవితేజ ఫెరోషియస్‌ అవతార్‌ను ప్రజెంట్‌ చేసింది. టెర్రిఫిక్‌ డైలాగ్‌లు, దావ్‌జాంద్‌ అద్భుతమైన బిజిఎమ్‌తో అదరగొట్టింది. టేకింగ్‌ టాప్‌ క్లాస్‌గా ఉంది. ప్రొడక్షన్‌ డిజైన్‌ చాలా లావిష్‌గా ఉంది. ‘వచ్చాడంటే మోతర, విధ్వంసాల జాతర’ అనే లైన్స్‌ సినిమాలోని మాస్‌ మహారాజా పాత్రను వివరిస్తూ ప్రేక్షకులకు మునుపెన్నడూ లేని విధంగా స్టైలిష్‌ యాక్షన్‌ ఎంటర్‌టైన్మెంట్‌ని ప్రామిస్‌ చేస్తున్నాయి. రిలీజ్‌ ట్రైలర్‌ సినిమాపై అంచనాలను మరింతగా పెంచింది. విడుదలకు ముందు అభిమానులకు మంచి ఉత్సాహాన్ని ఇచ్చింది. ఈనెల 9న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కావ్య థాపర్‌, అనుపమ పరమేశ్వరన్‌, నవదీప్‌, శ్రీనివాస్‌ అవసరాల, మధుబాల, ప్రణీత పట్నాయక్‌, అజరు ఘోష్‌ తదితరులు ఈ చిత్రంలోని ఇతర ముఖ్యతారాగణం.