– దేవాదాయ ధర్మాదాయ శాఖ సలాబత్పూర్ ఆంజనేయ స్వామి ఆలయ ఆవరణంలో పూజా సామాగ్రి వేలంపాట
– భక్తుల హంగామా
– పెట్రోల్ పోసుకొని ఆత్మ హత్యయత్నం చేసిన భక్తుడు
– వేలంపాట వాయిదా వేసిన అధికారులు
నవతెలంగాణ మద్నూర్: సలాబత్పూర్ ఆంజనేయ స్వామి ఆలయ ఆవరణంలో గురువారం ఏర్పాటుచేసిన పూజా సామాగ్రి అమ్మాకశాలల వేలంపాట నిలిచిపోయింది. తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక మూడు రాష్ట్రాల సరిహద్దులు గల మద్నూర్ మండలం సలాబత్పూర్ ఆంజనేయ స్వామి ఆలయంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో వేలంపాటకు ఆలయ ఆవరణంలో ఏర్పాటు చేశారు. వేలంపాటలో పాల్గొనే భక్తులు ముందుగా కొందరు ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కు రాతపూర్వకంగా ఒక వినతి పత్రాన్ని అందజేస్తూ ఆలయ ఆవరణంలో సామాగ్రి అమ్మడానికి వేలంపాట నిర్వహించిన ఆలయం బయట టెంకాయలు కానీ, ఇతర సామాగ్రి కానీ, అమ్ముకోవడానికి అనుమతిస్తే బాగుంటుందని ఉపాధి లేక ఎందరో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ప్రస్తుతం వేలంపాట వాయిదా వేసి సమస్య పరిష్కారం అనంతరం మళ్లీ వేలంపాట వేస్తే బాగుంటుందని కొంతమంది భక్తులు వేలంపాటలో విన్నవించగా వేలంపాటలో పాల్గొనేందుకు పదివేల చొప్పున డిపాజిట్ చేసిన భక్తులు ఎలా వాయిదా వేస్తారని వాయిదా వెయ్యమనటానికి మీరెవరు అంటూ భక్తుల మధ్య కొంత హంగామా జరిగింది డిపాజిట్ చేసిన ఒక వ్యక్తి మరొకరితో నువ్వు ఎంత నేనెంత అనే రీతిలో మాట్లాడడం వేలంపాట వాయిదా వేయకుంటే పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంటానంటూ ఒక భక్తుడు హెచ్చరించి వెళ్లిపోయాడు బయటకు వెళ్లిన భక్తుడు పెట్రోల్ తీసుకువచ్చి ఆలయ ఆవరణంలో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించారు.
అక్కడున్న భక్తులు ఆత్మహత్యకు పాల్పడకుండా పెట్రోల్ పోసుకున్న భక్తునికి కాపాడారు ఈ సమస్య జటిలంగా ఉండడంతో ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వేలం పాటను అనువార్య కారణాలవల్ల వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. వేలంపాట త్వరలోనే జరగడానికి పై అధికారుల దృష్టికి ఇక్కడి భక్తుల సమస్యలను తీసుకవెల్లి ఈ నెలాఖరులోగా వేలంపాట జరగడానికి కృషి చేస్తామని భక్తులకు హామీ ఇచ్చారు గత సంవత్సరం ఆలయ ఆవరణంలో పూజా సామాగ్రి అమ్ముకోవడానికి వేలంపాట వేయగా నాలుగు లక్షల 51 వేల రూపాయలు ఆలయానికి ఆదాయం వచ్చిందని ఈసారి కూడా పూజా సామాగ్రి వేలంపాట నిర్వహించడానికి దేవాదాయ ధర్మాదాయ శాఖ నిబంధనల ప్రకారం ఏర్పాటు చేయగా గ్రామ ప్రజలు భక్తులు వినత్పత్రంతో వేలంపాట వాయిదా వేయాలని కోరడమే కాకుండా ఒక భక్తుడు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడడం దగ్గరున్న భక్తులు ఆయనను కాపాడకపోతే పెద్ద హంగామా జరిగేది సమస్య జటిలం కాకుండా వేలంపాట అధికారులు వాయిదా వేశారు.