నవతెలంగాణ కమ్మర్ పల్లి
మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన పలువురు లబ్ధిదారులకు శుక్రవారం కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తహసిల్దార్ ఆంజనేయులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక రైతు వేదిక భవనంలో ఉదయం 11 గంటలకు లబ్ధిదారులకు అతిథుల చేతుల మీదుగా కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. లబ్ధిదారులు సకాలంలో హాజరై చెక్కులను స్వీకరించాలని సూచించారు.