మలుపులు ప్రమాదాలకు పిలుపులు

– సూచిక బోర్డు లేక అవస్థలు
-పట్టించుకోని అధికారులు
నవతెలంగాణ _బొమ్మలరామరం : గ్రామాలలో ఎలాంటి సూచిక బోర్డు లేని మలుపులతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ఈ మలుపుల వద్ద సూచిక బోర్డు ఏర్పాటు చేయాలని పలుమార్లు అధికారులను వినిపించిన పట్టించుకోవడం లేదు. దీంతో ఆ గ్రామ మీదిగా వెళ్లాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రయాణించాల్సి వస్తుంది. బొమ్మలరామారం మండలంలోని రంగాపురం నుండి రామలింగపల్లి, తూముకుంట వెళ్లే మూలమలుపులు చాలా ప్రమాదకరంగా మారాయి. మొన్నటికి మొన్న రామలింగపల్లి గ్రామపంచాయతీ వద్ద సూచిక బోర్డులు లేకపోవడంతో డీసీఎం అదుపుతప్పి ఇంటి గోడను ఢీ కొట్టింది.ఎలాంటి ప్రమాదం లేకపోవడంతో గండం గట్టెక్కింది.అధికారులు ఏలాంటి సూచిక బోర్డు పెట్టకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని ఇప్పటికైనా అధికారులు స్పందించి సంఘటనలు కాకుండా చూడాలని ప్రజాప్రతినిధులను,అధికారులను, గ్రామ ప్రజలు కోరుతున్నారు.