మణికందన్, శ్రీ గౌరి ప్రియ, కన్న రవి లీడ్ రోల్స్‌లో నటిస్తున్న సినిమా ‘ట్రూ లవర్’. ఈ సినిమాను మిలియన్ డాలర్ స్టూడియోస్, ఎంఆర్ పీ ఎంటర్ టైన్‌మెంట్ బ్యానర్స్ పై నజేరత్ పసీలియన్, మగేష్ రాజ్ పసీలియన్, యువరాజ్ గణేషన్ నిర్మించారు. ప్రభురామ్ వ్యాస్ రూపొందించిన ఈ సినిమాను డైరెక్టర్ మారుతి, ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమాను ఈ నెల 10న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని ఘనంగా నిర్వహించారు. ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి మాట్లాడుతూ, ‘ఈ సినిమా తమిళ ప్రీమియర్స్‌కు సూపర్ హిట్ టాక్ వచ్చింది. తెలుగులోనూ అదే రెస్పాన్స్ ఉంటుందని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం. ఈ సినిమా చూస్తున్నంతసేపు అబ్బాయిలైతే తమ జీవితాల్లో ఇలాగే జరిగిందని అనుకుంటారు. అమ్మాయిలకూ బాగా నచ్చే సినిమా అవుతుంది’ అని అన్నారు. ‘ఈ సినిమా తమిళ ప్రీమియర్స్ చూసిన వాళ్లు ఇటీవల కాలంలో ఇలాంటి మంచి లవ్ స్టోరీ రాలేదని చెబుతున్నారు. తెలుగు ఆడియెన్స్‌కు కూడా ఈ సినిమా బాగా నచ్చుతుంది. కొన్ని థియేటర్స్‌లో పెయిడ్ ప్రీమియర్స్ వేస్తున్నాం. ఈ సినిమా ఈ వాలెంటైన్ డే విన్నర్ అవుతుంది. 200 థియేటర్స్‌లో రిలీజ్ చేస్తున్నాం’ అని నిర్మాత ఎస్‌కేఎన్ చెప్పారు. దర్శకుడు మారుతి మాట్లాడుతూ, ‘నేను ఈ సినిమా ఫస్ట్ టైమ్ చూసినప్పుడు ఎలాంటి ఎగ్జైట్‌మెంట్ కలిగిందో తమిళ ప్రీమియర్స్ తర్వాత సోషల్ మీడియాలో వస్తున్న పోస్ట్‌లు చూస్తున్నప్పుడు అంతే సంతోషం కలిగింది. మణికందన్, శ్రీ గౌరి ప్రియతో మా మాస్ మూవీ మేకర్స్ పై స్ట్రైట్ తెలుగు సినిమా చేస్తాం. మంచి కంటెంట్‌తో వస్తున్న ఈ సినిమా కచ్చితంగా మంచి విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాం’ అని తెలిపారు.