కేంద్ర ప్రభుత్వం ఆదాయపుపన్ను పరిధిని రూ.7 లక్షల వరకు, స్టాండర్డ్ డిడక్షన్ రూ.50,000 కలిపి ఏడున్నర లక్షల వరకు మినహాయింపు ఇవ్వటం జరిగింది. సెక్షన్ 87 ఏ ప్రకారం రూ.25000 రిబేట్ కూడా ఇవ్వటం జరిగింది. కాని నిబంధనలకు విరుద్ధంగా నిజామాబాద్ జిల్లా ట్రెజరరీ అధికారులు పెన్షనర్స్ ట్యాక్స్ స్టేట్మెంట్లో ఏడున్నర లక్షలు, అంతకంటే తక్కువ పెన్షన్ పొందే వారికి కూడా ఆదాయపు పన్ను చెల్లించాలని ఆదేశాలు ఇవ్వటం మూలాన, వివిధ ప్రాంతాలలో నున్న పెన్షనర్లు బ్యాంకుల చుట్టూ, అధికారుల చుట్టూ తిరుగుతూ మానసిక ఆందోళనకు గురవుతున్నారని, తెలంగాణ ఆల్ పెన్షనర్స్,రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ నిజాంబాద్ జిల్లా శాఖ ఆరోపించింది. ఆ మేరకు శుక్రవారం సంఘ ప్రతినిధి బృందం ట్రెజరరీ డిప్యూటీ డైరెక్టర్ కు విజ్ఞాపన పత్రం ఇవ్వటం జరిగింది. దీనితోపాటుగా పుట్టినరోజు వివరాలు లేని ఫ్యామిలీ పెన్షనర్లకు అందుబాటులో ఉన్న ఆధార్ పత్రాలను గమనంలోకి తీసుకొని, క్వాంటం ఆఫ్ పెన్షన్ చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. ఆదాయపు పన్నుకు సంబంధించిన సమాచారాన్ని పెన్షనర్లు ఈనెల 22వ తేదీ వరకు ఇచ్చేందుకు అనుమతించినట్లు జిల్లా అధ్యక్షులు కే రామ్మోహన్రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు సిర్ప హనుమాన్లు కోశాధికారి ఈవియల్ నారాయణ, కార్యదర్శి అందే సాయిలు, జిల్లా నాయకులు లావు వీరయ్య, లక్ష్మీనారాయణ ప్రభురావు , ఎస్ టి ఓ జగదీష్ ఇతర అధికారులు చర్చల్లో పాల్గొన్నారు. తదితరులు పాల్గొన్నారు.