నవతెలంగాణ – అచ్చంపేట
అర్ధరాత్రి 12 గంటల సమయంలో రెవెన్యూ ఉద్యోగి హన్మంత్ తో కలిసి బొమ్మనపల్లి మాజీ సర్పంచ్ బొడ్క నాయక్ లు రికార్డులు చోరీ చేయడానికి ప్రయత్నించారు. గమనించిన కాంగ్రెస్ నాయకులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. భూములకు సంబందించిన విలువైన రికార్డులలో పేర్లు మార్పులు చేస్తున్నారని, కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. సామాన్య ప్రజలు పనుల కోసం తహసీల్దార్ కార్యాలయానికి వస్తే, రోజుల తరబడి కార్యాలయం చుట్టూ తిప్పుకుంటారు. అలాంటిది అర్ధరాత్రి 12 గంటల సమయంలో కార్యాలయంలో ఎలా పనులు చేస్తారని ప్రశ్నించారు. ఎస్ ఎల్ బీసీ ప్రాజెక్ట్ నిర్మాణంలో, భూములు కోల్పోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చింది. అయితే చాలామంది రైతులు భూములు లేకపోయినప్పటికీ, నకిలీ రికార్డులు సృష్టించి ప్రభుత్వం నుంచి నష్టపరిహారం తీసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. రైతుల జాబితా మాయం చేయడానికి కుట్రలు జరుగుతున్నాయని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. ఈ విషయంపై పూర్తి విచారణ చేసి, బాధ్యులపైన చర్యలు తీసుకుంటామని అచ్చంపేట తహసీల్దార్ తెలిపారు.