జీజేహెచ్పీఎస్ మండలాధ్యక్షుడిగా సమ్మయ్య గౌడ్

నవతెలంగాణ – పెద్దవంగర: గౌడ జన హక్కుల పోరాట సమితి మండల నూతన అధ్యక్షుడిగా గంట్లకుంట గ్రామానికి చెందిన ఎరుకలి సమ్మయ్య గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం జీ.జే.హెచ్.పీ.ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మూల వెంకటేశ్వర్లు గౌడ్ ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యదర్శి కమ్మగాని పరమేశ్వర్ గౌడ్, జనగామ జిల్లా ప్రధాన కార్యదర్శి నర్మెట శ్రీనివాస్ గౌడ్ చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన సమ్మయ్య గౌడ్ మాట్లాడుతూ.. గౌడ కులస్తుల హక్కుల సాధన కోసం తన శక్తి మేరకు పోరాడతానని అన్నారు. గీత కార్మికుల సంక్షేమ లక్ష్యంగా సంఘాన్ని మరింత బలోపేతం చేస్తానని చెప్పారు. తన నియామకానికి సహకరించిన సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు ఎలికట్టె విజయ్ కుమార్ గౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పొలిట్ బ్యూరో సభ్యులు మూల వెంకటేశ్వర్లు గౌడ్, రాష్ట్ర, జిల్లా బాధ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.