గోపీచంద్ నటిస్తున్న తాజా యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘భీమా’. ఎ.హర్ష దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కెకె రాధామోహన్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్ ‘ఏదో ఏదో మాయ..’ని మేకర్స్ విడుదల చేశారు. టీజర్ ప్రధానంగా సినిమా బ్యాక్‌డ్రాప్‌ను, గోపీచంద్ పాత్రను టఫ్ కాప్‌గా పరిచయం చేయడంపై దష్టి పెడితే, ఫస్ట్ సింగిల్ ద్వారా భీమా ప్రేమ కథను ప్రజెంట్ చేశారు. రవి బస్రూర్ స్వరపరిచిన ఈ అద్భుతమైన రొమాంటిక్ నంబర్‌కి చేసిన కంపొజింగ్ చాలా ప్లజెంట్‌గా ఉంది. విన్న వెంటనే ఈ పాటతో ప్రేమలో పడతారనే దీమాని మేకర్స్ వ్యక్తం చేస్తున్నారు. కళ్యాణ్ చక్రవర్తి రాసిన సాహిత్యం హీరో తాను గాఢంగా ప్రేమిస్తున్న అమ్మాయి పట్ల చూపే ఆరాధనను వర్ణిస్తుంది. అతను ఆమెతో సమయం గడపడానికి తన ఇగోలను పక్కన పెట్టే పోలీసు. టీచర్‌గా పరిచయమైన మాళవిక శర్మ కూడా పిల్లలతో కలిసి మెలిసి వారికి సహాయం చేస్తూ కనిపించింది. గోపీచంద్, మాళవిక జంట తెరపై బ్యూటీఫుల్ కెమిస్ట్రీని పంచుకున్నారు. అనురాగ్ కులకర్ణి వాయిస్ కట్టిపడేసింది. ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్ మరో కథానాయిక. మహా శివరాత్రి కానుకగా మార్చి 8న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రానికి డీవోపీ: స్వామి జె గౌడ, సంగీత దర్శకుడు: రవి బస్రూర్, ప్రొడక్షన్ డిజైనర్: రమణ వంక, ఎడిటర్: తమ్మిరాజు, డైలాగ్స్: అజ్జు మహంకాళి, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, వెంక, డాక్టర్ రవివర్మ.