
– మున్సిపల్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు మాయ కృష్ణ
నవతెలంగాణ – భువనగిరి
ఈనెల ఫిబ్రవరి 16 దేశవ్యాప్త మున్సిపల్ కార్మికుల సమ్మె చేయాలని కమిషనర్ కి నోటీస్ శనివారం అందజేశారు. ఈ సందర్భంగా మాయ ఇష మాట్లాడారు. దేశంలో బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగలకు భద్రత లేకుండా పోయింది. కాంటాక్ట్, అవుట్ సోర్సింగ్ విధానాన్ని రద్దుచేసి, మున్సిపల్ కార్మికులకు పర్మిట్ చేయాలని, కనీస వేతనము రూ.26,000 నిర్ణయించాలన్నారు. నాలుగు లేబర్ కోడ్ ను రద్దు చేయాలన్నారు. ఈపిఎఫ్ పెన్షన్ రూ.10వేలు రూపాయలు ఇవ్వాలన్నారు. ఆహార వస్తువులను, నిత్యవసరాలపై జీఎస్టీ ని ఉపసంహరించాలి. పెట్రోల్, డీజిల్, కిరోసిన్, వంటగ్యాసులపై కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని గణనీయంగా తగ్గించాలన్నారు. అట్టడుగు వర్గాలపై అణిచివేతను అరికట్టాలి. సామాజిక న్యాయాన్ని కాపాడాలి. మన పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ కార్మికులకు చెల్లిస్తున్నట్లుగానే, తెలంగాణలో కూడా రూ.21000 వేతనాలు చెల్లించాలి. పారిశుద్ధ్యం సేవల్లో ప్రైవేటీకరణ చర్యలను ఉపసంహరించాలి. రాంకి తదితర ప్రైవేట్ కంపెనీలతో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయాలి. ప్రమాదాల్లో మరణిస్తే కార్మికులకు రూ. 25 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ పథకాన్ని ప్రవేశపెట్టాలి. దహన సంస్కారాలకు రూ.30000 ఇవ్వాలి. ఆదివారాలు, పండుగ సెలవులు, ఎనిమిది గంటల పని దినాన్ని అమలు చేయాలి. వాటర్ వర్క్ కూడా వర్తింపజేయాలి. కార్మికులకు అందరికీ మొదట ప్రాధాన్యత ఇచ్చి, డబల్ బెడ్ రూములు ఇళ్ల స్థలాలు కేటాయించాలి. వీటన్నింటినీ వర్తింపజేయాలని ఈనెల 16న దేశవ్యాప్త సమ్మెలో పాల్గొంటారని కమిషనర్ కి సమ్మె నోటీసు అందజేశారు. పట్టణ కన్వీనర్ గంధ మల్ల మాతయ్య పిసికే సంతోష్ పాల్గొన్నారు.