గృహజ్యోతి లబ్ధిదారుల వివరాల సేకరణ

నవతెలంగాణ – మోపాల్

గృహ జ్యోతి పథకంలో లబ్ధిదారుల వివరాలను విద్యుత్ అధికారులు శనివారం రోజున సేకరించడం జరిగింది. కంజర, నర్సింగ్ పల్లి, మోపాల్ తదితర గ్రామాలలో ఎలక్ట్రిసిటీ ఎ ఈ బాబా శ్రీనివాస్ దగ్గరుండి మరీ లబ్ధిదారుల నుండి అప్లికేషన్ ఫారం ను అనుసంధానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎ ఈ బాబా శ్రీనివాస్ మాట్లాడుతూ తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి లబ్ధిదారులు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పొందే అవకాశం ప్రభుత్వం కల్పించిందని దీన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలిపారు. యే సమస్య ఉన్న తన దృష్టికి తీసుకురావాలని కచ్చితంగా పరిష్కరించే  విధంగా చూస్తానని ఆయన పేర్కొన్నారు.