ప్రజాపాలన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించాలి

నవతెలంగాణ – రాయపర్తి
ప్రజా పాలన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని జెడ్పీ సీఈఓ రాంరెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రంలో, పెర్కవేడు గ్రామంలో ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల ఇళ్లను సందర్శించి వంట గ్యాస్ దరఖాస్తులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. లబ్ధిదారులకు ఇబ్బంది కలగకుండా ప్రతి ఒక్క దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. ప్రజాపాలనల దరఖాస్తుల్లో ప్రజలకు ఎలాంటి సందేహాలు ఉన్న అర్థమయ్యే రీతిలో వివరించి చెప్పాలని తెలిపారు. వంట గ్యాస్ బెన్ఫిషర్ ల ఆధార్ కార్డు నెంబర్, గ్యాస్ కనెక్షన్ నెంబర్ ల సేకరణలో ఎలాంటి తప్పిదాలు లేకుండా చూడాలని సూచించారు. ఆయనతోపాటు ఎంపీడీఓ కిషన్ నాయక్, ఎంపిఓ తుల రాంమ్మోహన్, గ్రామపంచాయతీ కార్యదర్శులు రాకేష్, వెంకటేష్, జిపి బిల్ కలెక్టర్లు మల్లయ్య, ఉపేందర్ తదితరులు ఉన్నారు.