
నవతెలంగాణ – మద్నూర్
పీఆర్ టీయూ ఆధ్వర్యంలో ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని మద్నూర్ మండల కేంద్రానికి చెందిన వడ్డే బస్లింగ్ విశ్రాంత ఉపాధ్యాయునికి పీఆర్ టీయూ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఆవిర్భావ దినోత్సవంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ విద్యాశాఖ జిల్లా అధికారి రాజు పీఆర్ టీయూ జిల్లా అధ్యక్షులు దామోదర్ రెడ్డి జిల్లా పీఆర్ టీయూ ప్రధాన కార్యదర్శి కుశాల్ ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. వడ్డే బస్లింగ్ విశ్రాంతి ఉపాధ్యాయునికి జిల్లా కలెక్టర్ పీఆర్ టీయూ జిల్లా నాయకులు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఘనంగా సన్మానించడం, ఆ ఉపాధ్యాయిని కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తపరిచారు. ఈ సన్మాన కార్యక్రమం పలువురు పీఆర్ టీయూ నాయకులు విశ్రాంత ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.