పరిశ్రమ నిర్మాణంపై వివేకంగా ఆలోచించాలి 

– ఇథనాల్ పరిశ్రమపై అయా గ్రామస్తులకు సీఐ శ్రీనివాస్ అవగాహన 

– నిర్మాణ పనులను ధ్వంసం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరిక 
నవతెలంగాణ – బెజ్జంకి 
ప్రభుత్వం అనుమతులు జారీ చేసిన ఇథనాల్ పరిశ్రమ నిర్మాణంపై గుగ్గీల్ల, తిమ్మాయిపల్లి గ్రామస్తులు వివేకంగా ఆలోచించాలని సీఐ శ్రీనివాస్ సూచించారు. శనివారం మండల పరిధిలోని బెజ్జంకి క్రాసింగ్ గ్రామంలోని పంక్షన్ హాల్ యందు ఇథనాల్ పరిశ్రమ నిర్మాణం వల్ల కలిగే ప్రయోజనాలను గుగ్గీల్ల, తిమ్మాయిపల్లి గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఇథనాల్ పరిశ్రమ నిర్మాణానికి ప్రభుత్వం నుండి అనుమతులున్నాయని నిర్మాణ పనులను అడ్డకోవడం, ఆస్తులను ధ్వంసం చేయడం వంటి వాటిపై చట్టపరమైన కఠిన చర్యలు చేపడుతామని సీఐ హెచ్చరించారు. ప్రభుత్వ అనుమతులను రద్దు చేసుకుని ఉత్తర్వులను తీసుకువస్తే గ్రామస్తులకు పోలీస్ శాఖ ఖచ్చితంగా సహకరిస్తుందని సీఐ భరోసా ఇచ్చారు.ఎస్ఐ నరేందర్ రెడ్డి,అయా గ్రామాల గ్రామస్తులు హజరయ్యారు.