
ఉమ్మడి నల్గొండ జిల్లా లో శనివారం జరిగిన 9,11వ తరగతుల ప్రెవేశానికి నిర్వహించిన పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని జవహర్ నవోదయ ప్రిన్సిపాల్ నాగభూషణం తెలిపారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చలకుర్తి క్యాంపు జవహర్ నవోదయ విద్యాలయంలో 2024–28 విద్యా సంవత్సరానికి 9వ, 11వ తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్లకు నల్లగొండ జిల్లా కేంద్రంతో పాటు చలకుర్తి జేఎన్‌వీలోనూ, 11వ తరగతి ప్రవేశానికి నిర్వహించే పరీక్షా కేంద్రాలను సూర్యాపేట జిల్లా కేంద్రంలో పరీక్షలు నిర్వహించారుని అన్నారు. తోమ్మిదవ తరగతిలో ఖాళీగా ఉన్న 7 సీట్లకుగాను ప్రవేశ పరీక్ష నిర్వహణకు మొత్తం 4 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 9వ తరగతి లో 1,267 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకావసి ఉండగా 930 మంది విద్యార్థులు హాజరుయ్యారు.337మంది ఆబ్సెంట్ అయ్యారని తెలిపారు.11వ తరగతికి గాను 2126 మంది విద్యార్థులకు 1781 మంది హాజరయ్యారని తెలిపారు.