
ఎండలు విస్తృతంగా కొడుతున్నందున, మేడారం భక్తుల దాహార్తి తీర్చేందుకు మంత్రి వర్యులు శ్రీమతి డా.దనసరి అనసూయ సీతక్క ఆదేశానుసారం గోవిందరావు పేట గ్రామ పంచాయితీ కార్యాలయం ఎదుట శనివారం. చలి వెంద్రం ప్రారంభించినట్లు పంచాయితీ కార్యదర్శి డేగల శంకర్ తెలిపారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ పంచాయితీ రాజ్ మరియు గ్రామీణ అభివృద్ది , స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు ,డా,సీతక్క ,మేడారం సమ్మక్క సారలమ్మ జాతర కు వెళ్ళే భక్తులకు గ్రామ పంచాయితీ ల ద్వారా జాతీయ రహదారి పై వున్న అన్ని గ్రామ పంచాయితీ లకు ఆదేశాలు జారీచేయగా నేడు గోవిందరావు పేట గ్రామ పంచాయితీ కార్యాలయం ముందు చలి వేంద్రం ప్రారంభించి, మేడారం జాతర భక్తులకు ,ప్రజలకు మంచి నీరు అందించారు , ఈ కార్య క్రమం లో బిల్ కలెక్టర్ అశోక్ ,సిబ్బంది వెంకన్న ,సంజీవరెడ్డి ,ఉప్పలయ్య ,సుమన్ ,పంచాయితీ సిబ్బంది ,మరియు భక్తులు ,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.