
తెలంగాణ రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ, బిసి సంక్షేమ, ప్రభుత్వ గురుకులాల్లో 2024-25 విద్యా సంవత్సరానికి గాను 5 వ తరగతి అడ్మీషన్స్ కై ఈ నేడు(ఆదివారం) నిర్వహిస్తున్న ప్రవేశ పరీక్షకు ఏర్పాట్లు అన్నీ పూర్తయినట్లు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ వై బి శ్యామలత, గిరిజన గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ పి నీలారాణి తెలిపారు. పరీక్ష ఉదయం 11గం.లనుండి ఒంటి గంట వరకు ఉంటుదన్నారు. సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో 480 మంది విద్యార్థులు, గిరిజన గురుకుల పాఠశాల లో 384 మంది హాజరుకానున్న విద్యార్ధులకు ఓ.యం.అర్ లో బబ్లింగ్ చేసే విధానంపై ఇన్విజిలేటర్స్ అవగాహన కల్పించడానికి పరీక్ష హాల్ లోకి గంట ముందే అనుమతిస్తామన్నారు. ఆలస్యమైతే అనుమతి ఉండదనీ గంట ముందే అంటే ఉదయం 10 గంటలకే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని విద్యార్థులకు వారు సూచించారు.