మార్చి 1 నుంచి టెన్త్ ప్రీఫైనల్ పరీక్షలు

– మార్చి 28 నుండి వార్షిక పరీక్షలు
– పరీక్షలు హాజరుకానున్న 9130 మంది విద్యార్థులు
నవతెలంగాణ – భువనగిరి
రాష్ట్రంలో పదోతరగతి ప్రీఫైనల్ పరీక్షలు వచ్చేనెల ఒకటో తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి.  వార్షిక పరీక్షలు మార్చి 28 నుండి ప్రారంభం కానున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో 9130 మంది ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు చెందిన విద్యార్థులు పరీక్షలు వ్రాయనున్నారు . ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలు ఈనెల 28 నుంచి ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. అందుకే పదో తరగతి ప్రీఫైనల్ పరీక్షలను మధ్యాహ్నం 1.45 నుంచి సాయంత్రం 4.45 గంటల వరకు  నిర్వహించనున్నారు. తొలిసారిగా ఫిజికల్ సైన్స్, బయలాజికల్ సైన్స్ సబ్జెక్టులకు వేర్వేరుగా పరీక్షలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. వచ్చేనెల ఒకటిన ఫస్ట్ లాంగ్వేజ్, రెండున సెకండల్ లాంగ్వేజ్, నాలుగున థర్డ్ లాంగ్వేజ్, ఐదున మ్యాథమెటిక్స్, ఆరున ఫిజికల్ సైన్స్, ఏడున బయలాజికల్ సైన్స్, 11న సోషల్ స్టడీస్ సబ్జెక్టులకు పరీక్షలు జరుగుతాయి.
264 పరీక్ష కేంద్రాల: 267 ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు గాను 264 పరీక్షా కేంద్రాలను జిల్లాలో ఏర్పాటు చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులు 4297, మోడల్, కేజీబీవీ, రెసిడెన్షియల్ పాఠశాలలో చదివిన 2230 మంది విద్యార్థులు  మొత్తము 6,527 మంది విద్యార్థులు ప్రైవేట్ ఏడేడ్ పాఠశాలకు చెందిన 6527 మంది పరీక్షలకు హాజరుకానున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో 4550 మంది బాలికలు 4579 బాలురు రెగ్యులర్ విద్యార్థులు ఒకరు ప్రైవేటు విద్యార్థి మొత్తము 9130 మంది పరీక్షలు వ్రాయనున్నారు.
పకడ్బందీగా నిర్వహణ చర్యల:  పదవ తరగతి పరీక్షల నిర్వహణకు జిల్లా విద్యాశాఖ అధికారులు పకడ్బందీగా చర్యలు తీసుకున్నారు మంచినీరు విద్యుత్ ఫ్యాన్లు ఇతర మౌలిక సదుపాయాలు ఉన్న పాఠశాలలను మాత్రమే పరీక్షా కేంద్రాల నిర్వహణ ఏర్పాటు చేశారు. ఫ్లయింగ్ స్క్వాడ్ నాలుగు టీంలు చీఫ్ సూపర్డెంట్లు 51 మంది డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ 51 మంది తోపాటు సిట్టింగ్ స్క్వాడ్ ఏర్పాటు చేశారు.
ఏర్పాట్లు పూర్తి, జిల్లా విద్యాశాఖ అధికారి కే నారాయణరెడ్డి: జిల్లాలో పదవ తరగతి పరీక్షలు సక్రమంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి కె నారాయణ రెడ్డి తెలిపారు. విద్యార్థులు సకాలంలో పరీక్షలు కు హాజరుకావాలని కోరారు. డిస్టిక్ బల్క్ పాయింట్ నుండి 17 మండలాల పోలీస్ స్టేషన్లో నుండి పరీక్షా కేంద్రాలకు పరీక్ష పత్రాలు పోతాయన్నారు. పరీక్షా కేంద్రాల ప్రధాన కార్యాలయం వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు పరీక్షా కేంద్రాల వద్ద ఒక్కొక్క కేంద్ర వద్ద ఇద్దరు నుండి ఐదుగురు పోలీసులు మెడికల్ సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విద్యార్థులు ఎలాంటి భయాందోళన లేకుండా పరీక్షలు రాసి అత్యుత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు.