పంట మార్పిడితో దిగుబడి ఎక్కువ

నవతెలంగాణ – జుక్కల్
మండలంలో సుమారుగా ఖరీఫ్ లో నీటీవసతిలేకున్న , బోరుబావులున్న వారు పంటల మార్పిడికి రైతులు శ్రీకారం చుట్టారు. వ్వవసాయాధికారుల శ్రమ ఫలించింది. రెగ్యులర్ గా ఒకేరకమైన పంటలు పండించడం వలన బూసారం తగ్గి పంట దిగుబడి తగ్గడంతో పాటు చీడపురుగుల బెడద ఎక్కువైంది. చీడపురుగులు భూమీ అడుగుబాగంలో దాక్కువటం,  వేసినపంటనే  ప్రతి ఎడాదీ మళ్లి  అదేపంట వేయడం పంటదిగుబడి తగ్గిందని వ్వవసాయదికారులు   చెపుతున్నారు,  కావున కొన్నేండ్లుగా వ్వవసాయ శాఖ గ్రామాలలో రైతులతో అవగాహన సమావేశాలు నిర్వహించినప్రుడల్లా పంటమార్పిడి చేయాలని రైతులకు తెలియచేసినారు. ముప్పై ఎండ్లుగా మండలంలో పొద్దుతిరుగు పంట వేయడం మానేసారు. కొన్నేండ్ల క్రితం పంటల సుమారుగా  సగానికి పైగా వ్వవసాయ భూములలో నాడు సన్ ఫ్లవర్ సాగు చేసే రైతులు ఎకరాకు పది  క్వీంటాల్ దిగుబడి  వచ్చేది.  నేడు మద్యలో ముప్పై ఏండ్లుగా సాగుచేయడం మానేశారు. వ్వవసాయ అధికారుల లెక్కల ప్రకారం మండలంలో  సుమారుగా మెుత్తం 39 వేల 7వందల  ఎకరాలు  పై చిలుకు వ్వవసాయ అనూకూలంగా భూములున్నాయని,  జుక్కల్  ప్రాంతంలో  ఖరీఫ్ సీజన్ లో పెసర, మినుము, సోయా తో పాటు సంవత్సకాలం పంటలైన పత్తి , కందులు, మిరప, ఇతర పంటలు రేగ్యులర్ గా పండిస్తారు, రబీ సీజన్ లో పెద్ద  తెల్ల జొన్న, మెుక్క జొన్న, తో పాటు కౌలాస్ నాళా ప్రాజెక్ట్  కింద  ఆయకట్టు  సుమారుగా 12వందల ఎకరాలు వరి సాగుచేస్తుంటారు. ఎండ్ల కొద్ది ఒకే రకమైన పంటలను సాగు చేయడం వలన భూమీలో  సాంద్రత తగ్గి సూక్ష్మ పోషక పదార్థాలు లోపం కల్గుతోంది, రసాయన ఎరువులు అధిక మేాతాదులో వాడటం వలన ఎడాదికేడాది పంట దిగుబడి తగ్గుతుంది, పంటమార్పీడి ముఖ్యమైన ఆంశం కాబట్టి ముప్పై ఎండ్ల తరువాత రైతు మనసు మార్చుకోవడం ఒక విధంగా శుభశూచకంగా తెలియచేస్తోంది. రాబోయే రోజులలో భారీగా పంట మార్పీడి చేస్తు అధికదిగుబడికి సేంద్రియ ఎరవుల పైన దృష్టి సారిస్తు, పంట పోలాలలో చెరువు మట్టి వేస్తు పంటల దిగుబడికి అధిక మెుత్తం సాదీంచేందుకు రైతులు శ్రమిస్తున్నారు.