
ఇమాంపేట గురుకుల కళాశాలలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం. విద్యార్థుల మరణాలపై తక్షణమే విచారణ జరిపించాలని ప్రజాతంత్ర విద్యార్థి సంస్థ జిల్లా కార్యదర్శి బాష్పoగి సునీల్ డిమాండ్ చేశారు. ఆదివారం మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ వరుస ఘటనలు జరుగుతున్న ప్రభుత్వం ఎందుకు సీరియస్ గా తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఎన్నో ఆశలతో విద్యాలయాలకు అడుగుపెడుతున్న విద్యార్థులు విగత జీవులుగామారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థిని వైష్ణవి ని హత్య చేసినట్టుగా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.కాబట్టి తక్షణమే విచారణ చేసి దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఉన్న సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాలలో విద్యార్థులకు భద్రత కరువైయిందని ఆవేదన వ్యక్తం చేశారు.విద్యార్థికి 50 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించి కుటుంబాన్ని ఆదుకోవాలన్నారు.