
బడ్జెట్లో విద్యారంగానికి నిధులు కేటాయించకుండా అన్యాయం చేశారని గాంధీ చౌరస్తా వద్ద నిరసన తెలుపుతూ తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్యారంగాన్ని తీవ్ర అన్యాయం చేసిందని బీసీ విద్యార్థి సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు పల్లగొర్ల మోదీరాందేవ్ యాదవ్ అన్నారు. వారు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓటన్ బడ్జెట్లో విద్యా రంగానికి కేవలం 7.8 అంటే రూ.21389 నిధులు కేటాయించడం అన్యాయం. గతంతో పోలిస్తే 1.3 నిధులు మాత్రమే ఎక్కువ కేటాయించారు రాజ్యాంగం లోని కోటరీ కమిషన్ విద్యారంగానికి రాష్ట్ర బడ్జెట్లో 20% నిధులు కేటాయించాలంటే కేవలం 7.8 శాతం నిధులు కేటాయించడం అన్యాయం ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ల ఊసే లేదు బడ్జెట్లో సంక్షేమ హాస్టళ్లకు మెస్చార్జీలు ఇస్తామన్న ఆలోచన లేదు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి నిధులు కేటాయించలేదు. మండలానికి ఇంటర్నేషనల్ స్కూల్ అని చెప్పి కేవలం రూ.500 కోట్లతో 570 మండలాలలో ఇంటర్నేషనల్ స్కూల్స్ ఎలా నిర్మిస్తారు. 900 గురుకుల పాఠశాలకు రూ.1500 కోట్లతో ఎలా నిర్మిస్తారు. యూనివర్సిటీలను రూ.2000 కోట్లతో అభివృద్ధి చేస్తామని చెప్పి 500 కోట్లు ఇవ్వడం దుర్మార్గం కొత్త యూనివర్సిటీల మాటే లేదు విద్యను వ్యాపారం చేయొద్దని భారత రాజ్యాంగంలో ఉన్న గత ప్రభుత్వం ప్రవేట్ సంస్థలకు దోచిపెట్టింది ఈ ప్రభుత్వం. అలా చేయకుండా విద్యార్థి సమస్యలను పరిష్కరించాలి. బడ్జెట్లో విద్యారంగానికి కనీసం15 నుండి 20% నిధులు కేటాయించాలి. పేద విద్యార్థులు అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని అన్నారు. ఈ సమావేశంలో గొలుసుల మధు,మల్లయ్య, విద్యారత్నం, క్రాంతి కుమార్, వెంకటేశ్వర్లు, శ్రీహరి, లింగస్వామి, సుధాకర్ పాల్గొన్నారు.