అబాకస్ మ్యాథ్స్ టాలెంట్ టెస్ట్ లో శ్రీ సాయి ప్రశాంతి విద్యార్థుల హవా

నవతెలంగాణ – భువనగిరి రూరల్ 
ఇంటర్ డిస్ట్రిక్ట్ అబాకస్ మ్యాథ్స్ టాలెంట్ టెస్ట్ లో భువనగిరి శ్రీ సాయి ప్రశాంతి విద్యా నికేతన్ విద్యార్థులు సీనియర్ విభాగంలో మొదటి బహుమతిని, జూనియర్ విభాగంలో ద్వితీయ బహుమతులు కైవసం చేసుకున్నారు. ఆదివారం జనగాం జిల్లా కేంద్రంలోని సాన్ మరియా హైస్కూల్ లో ఇంటర్ డిస్ట్రిక్ట్ అబాకస్ మ్యాథ్స్ టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. ఒకటవ తరగతి నుండి ఐదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు జరిగిన అబాకస్ మ్యాథ్స్ టాలెంట్ టెస్ట్ శ్రీ సాయి ప్రశాంతి విద్యా నికేతన్ ఐదవ తరగతి కి చెందిన కొత్తపల్లి సాయి విఘ్నేష్, జూనియర్ విభాగంలో అశుతోష్ ద్వితీయ బహుమతిని సాధించారు. ఈ సందర్భంగా విద్యార్థులను, అబాకస్ మ్యాథ్స్ టీచర్ కొడారి కళ్యాణి లను శ్రీ సాయి ప్రశాంతి విద్యా నికేతన్ ప్రిన్సిపాల్ తోటకూరి యాదయ్య అభినందించారు. ఈ కార్యక్రమంలో  విశ్వం ఎడ్యుటెక్ సొల్యూషన్స్ బాధ్యులు ప్రమోద్, ప్రశాంత్, వాసవి, శ్రీ సాయి ప్రశాంతి విద్యా నికేతన్ ఉపాద్యాయులు ప్రమీల, మౌనిక , విద్యార్థులు పాల్గొన్నారు.