టీపీసీసీ మేనిఫెస్టో కమిటీ మెంబర్ కు డీఎస్సీ అభ్యర్థుల వినతి

నవతెలంగాణ – నవీపేట్: టిపిసిసి మేనిఫెస్టో కమిటీ మెంబర్ హర్షవర్ధన్ రెడ్డికి డీఎస్సీ 2008 అభ్యర్థులు రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను అమలు చేయాలని ఆదివారం వినతిపత్రం అందించారు. జిల్లా కేంద్రంలో న్యూ అంబేద్కర్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో డీఎస్సీ 2008 కమిటీ ప్రతినిధి ముదాడం సాయి రెడ్డి మాట్లాడుతూ.. గత 15 సంవత్సరాలుగా న్యాయపోరాటం ఫలితంగా హైకోర్టు ఎస్ జిటి ఉద్యోగులుగా గుర్తించి ఆరువారాల్లో ఉద్యోగాలు ఇవ్వాలని తీర్పు ఇచ్చిందని కానీ గత ప్రభుత్వం హామీ ఇచ్చి నట్టేట ముంచిందని అన్నారు. అభ్యర్థుల విన్నపాన్ని సానుకూలంగా స్పందించి సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి కచ్చితంగా న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డీఎస్సీ అభ్యర్థులు పాల్గొన్నారు.