నవతెలంగాణ -మహాముత్తారం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఆజంనగర్ ఈస్ట్ ఎఫ్ ఆర్ ఓ ముక్తా రెహ్మత్ ను పిసిసిఎఫ్ హైదరాబాద్ సస్పెన్షన్ వేటు వేశారు. ముక్తా రెహ్మత్ బదిలీపై అజాం నగర్ కువచ్చి ఆరు నెలలు అవుతుండగా ఆయన మాత్రం వీధుల్లో రెండు నెలలుఉన్నారు. వీధుల్లో ఉండకపోవడం ఫిబ్రవరి 1 నుండి లీవ్ పెట్టకుండానే ఇంటికి వెళ్లిపోవడంతో సస్పెన్స్ వే టు వేశారని సమాచారం. ఆయన ఉన్నన్ని రోజులు తోటి అధికారులను ఇబ్బందులకు గురి చేసే వారు. ఒక బేస్ క్యాంపు నిరుద్యోగిదగ్గర జైనింగ్ కోసం 30 వేల తీసుకోవడం, ఆయన చేసిన తప్పులకు ఇతర అధికారులపై నెట్టి సస్మెంటు చేయించడం, పోడు రైతుల దగ్గర వాటాలు తీసుకోవడం ఇతని హాబీ గా మారింది. సస్పెన్స్ వేటు వేయడంతో రైతులు, తోటి అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు