
నేడు నల్గొండ లో జరిగే సభకు విద్యార్థులు, రైతులు, కార్యకర్తలు తరలివచ్చి విజయవంతం చేయాలని బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం చండూర్ మండల అధ్యక్షులు పనస లింగస్వామి గౌడ్ కోరారు. సోమవారం విలేకరులతో మాట్లాడుతూ.. రేపు జరగబోయే క్పష్ట జలాలు, కేఆర్ఎంబీ పై వాస్తవాలు ప్రజలకు వివరించడమే, టార్గెట్ గా కృష్ణా జలాలలో తెలంగాణ రాష్ట్ర హక్కుల సాధన లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ భారీ సభ నిర్వహిస్తుందని అన్నారు. విద్యార్థులు యూవకులు అధిక సంఖ్యలో పాల్గొని బహిరంగ సభ విజయవంతం చేయాలనీ కోరారు. ఈ కార్యక్రమంలో బోయపల్లి సతీష్ కిరణ్ వెంకన్న తదితరులు పాల్గొన్నారు.