నవతెలంగాణ – రామారెడ్డి
మండలంలోని వివిధ గ్రామాలకు ఎన్ఆర్ఈజీఎస్ నిధుల క్రింద రూ.కోటి ఐదు లక్షల నిధులు మంజూరైనట్లు సోమవారం జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్, నా రెడ్డి మోహన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. మండలంలోని కామారెడ్డి నియోజకవర్గ గ్రామాలైన అన్నారం రూ 20 లక్షలు, గొడుగు మర్రి తాండ పరిధిలోని సున్నపు రాళ్ళ తండాకు రూ.10 లక్షలు, స్కూల్ తాండ రూ.10 లక్షలు, బట్టు తాండ రూ.10 లక్షలు, జగదాంబ తాండ రూ.10 లక్షలు, ఎల్లారెడ్డి నియోజకవర్గ గ్రామాలైన రామారెడ్డి రూ.10 లక్షలు, గొల్లపల్లి రూ.5 లక్షలు, ఇస్సన్న పల్లి రూ. 5లక్షలు, ఉప్పల్వాయి రూ.10 లక్షలు, గిద్దరూ రూ.10 లక్షలు, మోషన్ పూర్ రూ.5లక్షలు మంజూరు అయినట్లు తెలిపారు.