
మహా ముత్తారంమండలంలోని ఆశకార్యకర్తలకు, ఏఎన్ఎం లకు అప్పుడే పుట్టిన పిల్లల నుండి మూడు సంవత్సరాల వారికీ ఏ విధంగా వినియోగించుకోవాలో మహా ముత్తారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జిల్లా మేనేజర్ మెరుగు నరేష్ వారికీ అవగాహన కల్పించారు.నూతనంగా ఏర్పడినటువంటి 108 నియానటల్ అంబులెన్స్ ని దానిలో ఉన్న అత్యాధునిక పరికరాల టెక్నాలజీ గురించి వివరించడం జరిగింది.అదేవిధంగా 108 సర్వీస్, 102 సర్వీస్ కూడా అదేవిధంగా ఎఫ్ హెచ్ ఎస్ (పార్థివ వాహనం) సర్వీస్ కూడా ఉపయోగించుకోవాలని అవేర్నెస్ డెమో ప్రోగ్రాం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ రాజుపైలట్, రాజశేఖర్, సంపత్ మరియు ఆశ, ఏఎన్ఎం, మెడికల్ ఆఫీసర్ సందీప్ పాల్గొన్నారు.