కేసీఆర్ బహిరంగ సభను బహిష్కరించాలి

– డీసీసీబీ మాజీ డైరెక్టర్ పిల్లలమర్రి శ్రీనివాస్ నేత
నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్
నల్లగొండలో రేపు జరగబోయే కేసీఆర్ బహిరంగ సభను బహిష్కరించాలని నల్గొండ జిల్లా ప్రజలను డీసీసీబీ మాజీ డైరెక్టర్ పిల్లలమర్రి శ్రీనివాస్ నేత సోమవారం పిలుపునిచ్చారు.10 సంవత్సరాలు కేసీఆర్ ను పరిపాలించమని తెలంగాణ ప్రజలు అధికారమిస్తే నల్లగొండ జిల్లాను ఎడారిగా మార్చారని శ్రీనివాస నేత అన్నారు. గతంలోనే నక్కలగండి,డిండి ఎత్తిపోతల పథకాలు 50 శాతం పూర్తయిన ఇప్పటివరకు వాటికి పూర్తి చేయలేదని అన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టులో రూ.1 కోట్ల అవినీతి చేసిన కేసీఆర్ నల్లగొండ జిల్లాకు రాకుండా అడ్డుకోవాలని పిల్లల మరి శ్రీనివాస్ నేత పిలుపునిచ్చారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు గతంలో ఎప్పుడైనా అసెంబ్లీలో ప్రాజెక్టుల గురించి మాట్లాడిరా అని నిలదీశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రాజెక్టులకు నిధులు కేటాయించకుండా బ్రష్టు పట్టించారో కోమటిరెడ్డి బ్రదర్స్ ఈరోజు అసెంబ్లీలో బహిరంగంగా వివరించారని అన్నారు. ఎస్ఎల్ బిసి,ఉదయ సముద్రం ప్రాజెక్టులకు దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి కేటాయించిన నిధులే తప్ప 10 సంవత్సరాలుగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్క రూపాయి కేటాయించి అభివృద్ధి చేయలేదని పిల్లలమర్రి శ్రీనివాస్ నేత దుయ్యబెట్టారు. ఏం మొఖం పెట్టుకొని రేపు నల్లగొండకు కేసిఆర్ వస్తున్నారని విమర్శించారు.