– గ్రామీణ భారత్ బంద్ ను జయప్రదం చేయండి
– రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మాటూరి బాలరాజ్ గౌడ్
– బీజేపీ ప్రభుత్వ కార్పోరేట్, మతతత్వ విధానాలను ప్రతిఘటిద్దాం
– నియంత మోడీ పాలనకు చరమ గీతం పాడుదాం
నవతెలంగాణ – భువనగిరి
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 16న నిర్వహించనున్న గ్రామీణ బందును విజయవంతం చేయాలని రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మాటూరు బాల్రాజ్ గౌడ్ విజ్ఞప్తి చేశారు సోమవారం స్థానిక సుందరయ్య భవన్లో కార్మిక సంఘాల సమావేశం నిర్వహించారు. పదేళ్ల బీజేపీ పాలన కాలంలో సామాన్యుల బతుకులు అధోగదిపాలయ్యాయని మోసపూరిత వాగ్దానాలతో ఎల్లకాలం ప్రజలను మభ్యపెట్టలేరన్నారు. మోడీ కార్మిక ,రైతాంగ, జా వ్యతిరేక విధానాలకు నిరసనగా కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ సంయుక్త కిసాన్ మోర్చా పెద్ద ఎత్తున ఉద్యమిస్తుందని తెలిపారు. బ్రిటిష్ కాలం నుండి పోరాడి సాధించుకున్న కార్మికుల 44 రకాల హక్కులని కాలరాసి నాలుగు లేబర్ కోడ్ లుగా మార్చిందని విద్యుత్ సవరణ బిల్లుని ఉపసంహరించుకోవాలన్నారు. రంగ సంస్థలని కారు చౌకగా కార్పొరేట్ ఆదాని అంబానీ లాంటి బడా పెట్టుబడిదారులకు దేశ సంపదను అమ్మేస్తుందని, వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు కల్పించాలన్నారు. ఉపాధి హామీ పథకాన్ని బలోపేతం చేసి ఈ స్కీముని పట్టణ ప్రాంతాలకు విస్తరించాలని 200 రోజుల పనిదినాలు కల్పించాలన్నారు. రోజు కూలి రూ. 600 ఇవ్వాలని అన్ని రకాల ఆహార వస్తువులపై జీఎస్టీ ని ఉపసంహరించుకోవాలన్నారు. కనీస పెన్షన్ రూ. 10000 ఇవ్వాలన్నారు. కాంట్రాక్ట్ విధానాన్ని రద్దుచేసి ఉద్యోగ కార్మికుల్ని పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. జనవరి 26 నుండి ఫిబ్రవరి 15 వరకు గ్రామ గ్రామాన రైతులు వ్యవసాయ కూలీలు కార్మికుల్ని సంఘటిత పరిచే విస్తృతంగా ఇప్పటికే ప్రచార కార్యక్రమం నిర్వహించామన్నారు. గ్రామీణ బంధుని దేశవ్యాప్త సమ్మె ని ప్రజలందరూ విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు దాసరి పాండు, జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేషం,వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బొల్లుయాదగిరి జిల్లా కార్యదర్శి కొండమడుగునరసింహ, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మేక అశోక్ రెడ్డి పాల్గొన్నారు.