– పీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్ గౌడ్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డితో చేసుకున్న లోపాయికారి ఒప్పందంతోనే కృష్ణా జలాలను ఏపీకి మళ్లించారని టీపీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్‌గౌడ్ ఆరోపించారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో బహిర్గతం చేస్తుందన్న ఆవేదనతో ముఖం లేకనే సభకు రావడం లేదని సోమవారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జగన్ సాక్షాత్తు ఏపీ అసెంబ్లీలో ప్రస్తావించిన విషయాన్ని గుర్తు చేశారు. జగన్ చెప్పినా, కేసీఆర్, హరీశ్‌రావుకు బుద్ధి రావడం లేదని విమర్శించారు. గత ప్రభుత్వం చేసిన నిర్వాకం వల్ల భూగర్భ జలాలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానానికి హరీశ్‌రావు ఆమోదం తెలపకుండా సీఎం రేవంత్‌పై విమర్శలు చేస్తున్నారని ఆయన విమర్శించారు.