సీఎం, మంత్రులను హరీశ్‌ ఒంటి చేత్తో ఎదుర్కొన్నారు

– ఎక్స్‌ వేదికగా కేటీఆర్‌ పొగడ్తలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
మాజీ మంత్రి హరీశ్‌ రావుపై బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షులు ఎక్స్‌ (ట్విట్టర్‌) వేదికగా ప్రశంశల వర్షం కురిపించారు. తెలంగాణ అసెంబ్లీలో కృష్ణా, కేఆర్‌ఎంబీ అంశాలపై జరిగిన చర్చలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, ఇతర మంత్రులను ఒంటి చేత్తో ఎదుర్కొన్నారని చెప్పారు. కృష్ణా జలాలు, కేఆర్‌ఎంబీకి సంబంధించి కాంగ్రెస్‌ నేతలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తన అద్భుత ప్రసంగంతో తిప్పికొట్టారని పేర్కొన్నారు. మంగళవారం జరగనున్న చలో నల్లగొండ సభకు సరైన గొంతును సెట్‌ చేశారన్నారు. కృష్ణా జలాలపై వాస్తవాలను కేసీఆర్‌ తనదైన శైలిలో ఎండగడుతారని చెప్పారు.