న్యూయార్క్ : దాదాపు 8.4 బిలియన్ డాలర్ల (సుమారు రూ.70,000 కోట్ల)కు పైగా విలువైన 5 కోట్ల అమెజాన్ షేర్లను విక్రయించాలని అమెజాన్ సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మెన్ జెఫ్ బెజోస్ యోచిస్తున్నారని సమాచారం. అమెజాన్ వ్యవస్థాపకులైన బెజోస్ ఆ సంస్థ సీఈఓ పదవి నుంచి 2021లో తప్పుకుని ఇతర ప్రాజెక్టులు పర్యవేక్షిస్తున్నారు. ఈ నెల 7,9 తేదిల్లో జెఫ్ బెజోస్ 1.2 కోట్ల అమెజాన్ షేర్లను విక్రయించారు. వీటి విలువ దాదాపు 2.04 బిలియన్ డాలర్లు(సుమారు రూ.17వేలకోట్లు)గా అంచనా వేశారు.