నిరు పేదలకు ఫుడ్ ప్యాకెట్స్ పంపిణీ

నవతెలంగాణ – రామగిరి
రామగిరి మండలం రత్నాపూర్ రాంనగర్ లో సోమవారం భవన నిర్మాణ కార్మిక సమైక్య సంఘం జిల్లా అధ్యక్షుడు చిలువేరు స్వామి సోదరుడు వెంకటేశం మనవడు ధార్విక్ మొదటి పుట్టినరోజు సందర్భంగా స్వామి వారి మనవని చేతుల మీదగా పేదలకు 20 మందికి బిర్యాని ప్యాకెట్స్ పంపిణీ చేశారు. తమ మనవని పుట్టినరోజు సందర్భంగా నిరుపేదలకు ఒక పూట అన్నం పెట్టడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ధార్విక్ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆయురారోగ్యాలతో ఉండాలని వారు ఆశీర్వదించారు.