జాతీయస్థాయి అథ్లెంటిక్స్ కి కేజీబీవీ విద్యార్థిని ఎంపిక

నవతెలంగాణ – మాక్లూర్
మండలంలోని కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాల  విద్యార్థిని జాతీయస్థాయి అత్లెంటిక్స్ కి ఎంపికైనట్లు పఠశలనప్రత్యేక అధికారిని ప్రగతి మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేజీబీవీ పాఠశాలలో చదివే గుగ్లోత్ నిఖిత ఈ నెల 16, 17, 18, 19వ తేదీలలో గుజరాత్ రాష్ట్రంలో జరిగే జాతీయస్థాయి టోర్నమెంట్ లో పాల్గొననున్నట్లు తెలిపారు. గత సంవత్సరం డిసెంబర్ లో జరిగిన జిల్లా స్థాయి అథ్లెంటిక్ అసోసియేషన్ టోర్నమెంట్ లో జరిగిన 600 మీటర్ల పరుగు పందెంలో జిల్లా మొదటి స్థానంలో నిలిచిందన్నారు. విద్యార్థినిని వ్యాయామ ఉపాధ్యాయురాలు సంధ్య, ఉపాధ్యాయ సిబ్బంది అభినందించారు.