నూతనంగా ఏర్పడిన డోంగ్లి మండల పరిధిలోని హాసన్ టాక్లి గ్రామంలో గత నెల జనవరి 24న గ్రామస్తుల వినతి పత్రంపై ఆ గ్రామపంచాయతీ పాలకవర్గం జనవరి 26న గ్రామంలో మద్యపానం, కల్లు, దేశిదారు, అమ్మకాలపైనే కాకుండా జూదం పేకాట వంటి వాటిని పూర్తిగా నిషేధించినట్లు గ్రామపంచాయతీ తీర్మానం మేరకు ఆ గ్రామ కార్యదర్శి గ్రామంలో దుకాణాల్లో గాని హోటల్ లలో గాని అమ్మకాలు జరపకూడదని హెచ్చరిక నోటీసులను ఆ గ్రామ కార్యదర్శి గ్రామం పరిధిలో అతికించడం జరిగింది. గ్రామ ప్రజల వినతి మేరకు గ్రామపంచాయతీ పాలకవర్గం గ్రామంలో మద్యపాన నిషేధాన్ని అమల్లోకి తీసుకువచ్చిందని జూదం పేకాట వంటి ఆటలు నిషేధించిందని ఆ తీర్మానంలో పేర్కొనడం జరిగింది. హెచ్చరిక నోటీసులకు బేకాతర్ చేస్తే చట్టపరమైన చర్యలు సంబంధిత శాఖల అధికారుల ద్వారా తీసుకోబడతాయని అతికించిన నోటీసుల్లో పేర్కొన్నారు.