సంఘటన స్థలాన్నీ పరిశీలించిన ఎంపీడీవో రాణి, బిచ్కుంద సీఐ

నవతెలంగాణ – పెద్దకొడప్ గల్
పెద్ద కొడపగల్ మండలంలోని జాతీయ రహదారి161 పోచారం గేటు వద్ద ఐదు రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాద స్థలాన్ని మండల అధికారిని ఎంపీడీవో రాణి, సీఐ నరేష్ పరిశీలించారు. ఈ సందర్భంగావారు ప్రమాదానికి గల కారణాలను స్థానికఎస్ఐ కోనారెడ్డిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం జాతీయ రహదారి అదికారులు మరియు సిబ్బందులకు ప్రమాదాలు అరికట్టేందుకు తగు సలహాలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రాణి, బిచ్కుంద సీఐ నరేష్, ఎస్సై కోనారెడ్డి, ఇన్సిడెంట్ మేనేజర్ సౌరబ్ ప్రతాప్, పోలీస్ సిబ్బందిలు,స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.