యాదాద్రి మెడికల్ కాలేజీ ఎక్కడికి వెళ్ళదు : ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య

నవతెలంగాణ – భువనగిరి రూరల్ 
యాదిగిరిగుట్ట లో ఏర్పాటు కాబోతున్న ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  కొడంగల్ కు తీసుకు వెళ్తుండని బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న ప్రకటనలు నిజం కాదని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఓ ప్రకటనలో తెలిపారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో ఓటమి తప్పదని గ్రహించి, ప్రజల మద్దతు లేని మాజీ ఎమ్మెల్యేలు ప్రజలను గందర గోలపరిచేందుకు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఆలేరు నియోజకవర్గ అభివృద్ధిని మరిచి సొంత ఆస్తులు పోగేసుకున్న నాయకులు పూటకో పార్టీ మార్చిన నాయకులు చెప్పే మాటలు ప్రజలు విశ్వసించవద్దన్నారు.నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా నేను నా నెల జీతాన్ని కూడా ప్రజలకే ఇస్తున్నానని నియోజవర్గ అభివృద్ధి నా ప్రధానంగా పనిచేస్తానన్నారూ. ఆధారం లేని ప్రకటనలు చేసే నాయకులు,ఆ పార్టీ కార్యకర్తలు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని వారి నాయకులకు జ్ఞానోదయం చేయాలన్నారు.ఈ పాలన కెసిఆర్ పాలన కాదని ప్రజాపాలన అన్నారు. అబద్దాలతో ప్రజలను మభ్య పెట్టాలని చూస్తే ప్రజలు.బిఅరెస్ నాయకులను గ్రామాల్లో తిరగనివ్వరని అన్నారు.